భారత్ న్యూస్ తిరుపతి,తిరుపతి శ్రీనివాసరావు సౌజన్యంతో స్వాములకు సద్ది.
కోడూరు అయ్యప్పస్వామి దేవాలయం నందు మాల ధరించిన స్వాములకు 41 రోజులపాటు నిర్వహిస్తున్న సద్ది (అన్నదానం) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం టి ఎస్ ఆర్ గ్రూప్ అధినేత, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి శ్రీనివాసరావు సౌజన్యంతో నిర్వహించారు.
ఈ సందర్భంగా టి ఎస్ఆర్ గ్రూప్ సభ్యులకు ఆలయ కమిటీ వారు దుశ్యాలువాతో పూలదండలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

అధిక సంఖ్యలో మాల ధరించిన స్వాములు పాల్గొన్నారు.