ప్రేక్షకులను అలరించిన చిన్నారులఅష్ట వినాయక ఆంగికాభినయ ప్రదర్శన

భారత్ న్యూస్ విశాఖపట్నం..ప్రేక్షకులను అలరించిన చిన్నారుల
అష్ట వినాయక ఆంగికాభినయ ప్రదర్శన

విశాఖపట్టణం, సెప్టెంబర్ 1: వినాయక చవితి సందర్భంగా విశాఖపట్టణం నగరంలోని అతిపెద్ద గాజువాక ‘సెలస్ట్’ అపార్ట్మెంట్ లో చిన్నారుల అష్ట వినాయక ఆంగికాభినయ ప్రదర్శన వందలాది మంది నివాసితుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఐదు రోజులపాటు విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వరునికి రాత్రి వైభవోపేతంగా నిమజ్జనోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మూడు గంటల పాటు జరిగిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
ప్రధానంగా దాదాపు 25 మందికి పైగా చిన్నారులలో 8 మంది వినాయకుడు, మరో 8 మంది పార్వతి పాత్రలలో వినాయకుని చరిత్రను సంక్షిప్తంగా కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించి, అలరించారు. నైతిక విలువలు కలిగిన, నీతి నిజాయితీని పెంపొందింపజేసే చరిత్రతో పాటు ముఖ్యంగా పురాణేతిహాసాలను మరిచిపోతున్న నేటికాలంలో ఇలాంటి రూపకాలు ముఖ్య సందర్భాల్లో నివాస ప్రాంతాలు, విద్యాసంస్థల్లో ప్రదర్శితమయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు.