..భారత్ న్యూస్ అమరావతి..ఆదివారం క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై దేవాదాయ, అటవీ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయశాఖ, అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల లాంటి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసి శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు….
