భారత్ న్యూస్ అనంతపురం .. ….అమర్నాధ్ యాత్ర కోసం జమ్మూలో 106 వసతి కేంద్రాలు
జమ్మూ – కాశ్మీర్ :
అమర్నాథ్ యాత్రకు సంబంధించిన మొదటి బ్యాచ్ జులై 2వ తేదిన జమ్మూ నుంచి బయలుదేరుతుంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి యాత్రను జెండా ఊపి
ప్రారంభిస్తారు. భద్రత దృష్ట్యా, యాత్రికులందరూ బ్యాచ్‌లతో ప్రయాణిస్తారు. ప్రైవేట్ వాహనాల్లో వచ్చే వారు కూడా ఈ బృందంతో ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. జమ్మూ డివిజన్లో 50వేల మందికిపైగా యాత్రికుల కోసం 106 వసతికేంద్రాలను ఏర్పాటు చేశారు.’
