మీ వాహన భద్రతే మాకు ముఖ్యం..

భారత్ న్యూస్ విజయవాడ…మీ వాహన భద్రతే మాకు ముఖ్యం..

విజయవాడ వెస్ట్ ఎసిపి దుర్గారావు పలు సూచనలు..

విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో (సితార) రంగ జంక్షన్ వద్ద విజయవాడ వెస్ట్ జోన్ ఏసిపి దుర్గారావు భవానిపురం సీఐ ఉమా మహేశ్వరరావు వారి సిబ్బందితో కలిసి..

వాహనాలు చోరీకి జరగకుండా నివారించే చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జియో ట్యాగ్ వాహనాలకు ఎక్కడ అమర్చాలి అని పలు సూచనలు చేశారు.

అంతేకాకుండా వాహనంకి జియో ట్యాగ్ అమర్చి ట్రైల్ కూడా నిర్వహించారు.

ఏసీపి కామెంట్స్:-వాహనాలకి జియో ట్యాగ్ అమరిస్తే వాహనాలు చోరీ కి గురవ్వకుండా ఉంటాయని దానివల్ల మీ విలువైన వాహనాలు మీ కంట్రోల్లో ఉంటాయని ఏసిపి దుర్గారావు ఈ సందర్భంగా పలు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఏసీపి దుర్గారావు క్రైమ్ ఎస్సై ఆనంద్, రవితేజ,సుమన్,అనూష తదితర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.