వెంకటగిరి 22: తిరుపతి జిల్లా వెంకటగిరి బెటాలియన్‌లో నిర్వహిస్తున్న ఏపీ ఎస్పీ ట్రైనింగ్ కార్యక్రమానికి.

భారత్ న్యూస్ తిరుపతి.తిరుపతి జిల్లా పోలీస్ శాఖ..

  • క్రమశిక్షణ పోలీస్ జీవితానికి పునాది..సమయపాలన కచ్చితంగా పాటించాలి.
  • శారీరక, మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలి
  • చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.
  • నిజాయితీతో విధులపట్ల నిబద్ధత అవసరం.
  • ప్రజలతో మానవీయంగా వ్యవహరించాలి. పోలీస్ శాఖ గౌరవాన్ని కాపాడే ప్రవర్తన అవసరం.
  • తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపిఎస్., గారు.

వెంకటగిరి 22: తిరుపతి జిల్లా వెంకటగిరి బెటాలియన్‌లో నిర్వహిస్తున్న ఏపీ ఎస్పీ ట్రైనింగ్ కార్యక్రమానికి గౌరవనీయులైన తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కొత్తగా SCPTCs (APSP) ఎంపికైన ఏపీ ఎస్పీ ట్రైనింగ్ సిబ్బందికి విలువలు, బాధ్యతలు, ప్రజాసేవపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తు.ఇప్పుడు పోలీస్ కుటుంబంలోకి అడుగుపెడుతున్న మీరు, దేశం కోసం సేవ చేయబోతున్నారు.ఈ శిక్షణ మీ భవిష్యత్ విధులకు పునాది క్రమశిక్షణ పోలీస్ జీవితం మొత్తం నడిపించే అంగి. సమయపాలన, యూనిఫాం ప్రాముఖ్యతను కచ్చితంగా పాటించాలి,శారీరక శక్తి మాత్రమే కాదు, మానసిక ధైర్యం కూడా కీలకం. చట్టాలు, కోడ్‌లపై పూర్తి అవగాహన కలిగి ఉండి. ఉన్నతాధికారుల ఆదేశాలను గౌరవంగా పాటించాలి. ప్రజలతో మానవీయంగా, సహనంగా వ్యవహరించి, నిజాయితీతో పని చేసి పోలీస్ శాఖ పేరు మిన్నగా ఉండేలా మీ ప్రవర్తన ఉండాలని మీరు చేసే సేవ, ఈ సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కొత్తగా పోలీస్ శాఖలో చేరిన కానిస్టేబుళ్లకు విధి, విలువలు, ప్రజాసేవ పట్ల బాధ్యతలపై వివరణాత్మక సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం ఉద్యోగం కాదు అది ఒక కర్తవ్యం, ఒక సేవా మార్గం అని స్పష్టం చేశారు. పోలీస్ జీవితంలో క్రమశిక్షణ, నిబద్ధత, నైతిక విలువలు అత్యంత కీలకమని, ప్రజల నమ్మకమే పోలీస్ బలమని తెలిపారు. యూనిఫాం ధరించిన క్షణం నుంచి వ్యక్తిగత జీవితం కూడా ప్రజాసేవకు అంకితమవుతుందని గుర్తుచేశారు. అలాగే సేవకు ముందు పిలుపు వచ్చేది పోలీస్ వారికే మనమే ముందుంటాము గతంలో కొన్ని విపత్తులో పోలీస్ శాఖ ముందుండి ప్రజాసేవకు అంకితమయింది మానవసేవయే మాధవ సేవ అన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని అన్నారు.

శిక్షణ కాలంలో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, చట్టాలపై పట్టు, ప్రొఫెషనల్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ట్రైనింగ్ సమయంలో కష్టాలు, క్రమశిక్షణ, కఠిన నియమాలు ఉంటాయని, అవే భవిష్యత్ సేవకు పునాది అవుతాయని పేర్కొన్నారు. సీనియర్ అధికారుల ఆదేశాలను గౌరవించడం, టీమ్ వర్క్‌తో పనిచేయడం, నిరంతర అధ్యయనం తప్పనిసరిగా ఉండాలని అన్నారు.

ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రజాసేవలోకి వచ్చినపుడు చట్టబద్ధత, నిష్పక్షపాతత్వం, మానవీయతతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. ప్రజల సమస్యలను వినడం, బాధితులకు ధైర్యం ఇవ్వడం, నేరాల నియంత్రణలో కఠినంగా వ్యవహరించడం ఈ మూడు అంశాల సమతుల్యతే మంచి పోలీస్ అధికారిని తయారు చేస్తుందని చెప్పారు. రిస్క్ ఉన్న విధులు పోలీస్ జీవితంలో సహజం అని, అలాంటి సందర్భాల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ధైర్యంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అలాగే, అవినీతి, అక్రమాలకు పూర్తిగా దూరంగా ఉండి శాఖ ప్రతిష్టను కాపాడాలి అని స్పష్టంగా హెచ్చరించారు.

చిన్న తప్పిదం కూడా శాఖకు చెడు పేరు తీసుకురావచ్చని, నిజాయితీతో పని చేస్తే వ్యక్తిగతంగా మంచి పేరు, శాఖకు గౌరవం రెండూ వస్తాయని తెలిపారు.

కష్టసుఖాలు రెండింటినీ సమానంగా స్వీకరించే మనస్తత్వం పెంచుకోవాలని, కుటుంబ సహకారం, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
చివరగా, ప్రజల భద్రతే లక్ష్యంగా, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచే పోలీస్‌గా ఎదగాలని కొత్తగా చేరిన సిబ్బందిని ప్రోత్సహించారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా నైపుణ్యవంతులైన, విలువలతో కూడిన పోలీస్ బలగం తయారవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ SCPTCs (APSP) శిక్షణార్థం మొత్తం 239 మంది హాజరైనారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీస్ అధికారులు, ట్రైనింగ్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.