భారత్ న్యూస్ విజయవాడ…మీకోసం కార్యక్రమం ద్వారా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ వి.వి నాయుడు..
మీకోసం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి, తక్షణమే పరిష్కరించాలి.
క్రైమ్ న్యూస్ కృష్ణా :
ప్రజలు నిత్యజీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారం కోసం మీకోసం కార్యక్రమాన్ని జిల్లా పోలీసు శాఖ తరపున నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులను స్వీకరించి, సమస్య తీవ్రత ఆధారంగా వాటిని సంబంధిత అధికారులకు బదిలీ చేసి, వాటిపై పరిష్కారం లభించేలా, సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకుంటూ ఫిర్యాదుదారులతో ముఖాముఖి సంభాషిస్తూ వారి సమస్యలకు తక్షణ పరిష్కారం అందించే దిశగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుంది.
ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ వి.వి నాయుడు గారు మీకోసం కార్యక్రమం లో ఫిర్యాదు దారుల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రజా సమస్యల పరిష్కారం లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులకు, సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. మీకోసం కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ఈరోజు మీకోసం కార్యక్రమానికి మొత్తం 40 ఫిర్యాదులు రాగ అందులో..
🔹కూచిపూడి నుండి విశ్వేశ్వరరావు అనే వ్యక్తి వచ్చి తన వ్యవసాయ భూమిని తన సరిహద్దుదారుడు ఆక్రమించాలని చూస్తున్నాడని, అదేమని అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతూ శారీరకదాడి చేస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.
🔹కంకిపాడు నుండి కవిత అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుందని అదనపు కట్నం కోసం తన భర్త, అత్తింటి వారు వేధింపులకు పాల్పడుతున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.

🔹గుడివాడ నుండి నాని అనే యువకుడు వచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి తన స్నేహితుడు మోసం చేశాడని, ఉద్యోగం నిమిత్తం తను ఇచ్చిన డబ్బు ఇవ్వకపోగా బెదిరిస్తున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు.