భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…కృష్ణాజిల్లా పోలీస్
డ్రోన్ కెమెరాల సహాయంతో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని అదుపులోనికి తీసుకున్న ఉంగుటూరు పోలీసులు.
కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాల సహాయంతో జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు విశిష్ట కృషి చేస్తూ, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, ఆకతాయిలు వేధింపులకు పాల్పడిన, చట్ట వ్యతిరేక, జూద కార్యకలాపాలు నిర్వహించినా మిమ్మల్ని పసిగడతామని హెచ్చరిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు.
అందులో భాగంగా ఉంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంగుటూరు గ్రామ శివారులో డ్రోన్ కెమెరాల సహాయంతో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురిని గుర్తించి వారిని అదుపులోనికి తీసుకొని వారిపై ఉంగుటూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
