భారత్ న్యూస్ మంగళగిరి…నిరుద్యోగులకు శుభవార్త.. భారీ రిక్రూట్మెంట్!
నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 11,639 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గత నెల 29న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్కు ఆయన ఒక లేఖ రాశారు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే భారీస్థాయిలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.
