మగవాళ్ళను ట్రాప్ చేయడం..బిజినెస్ పేరుతో ముంచేయడం.. సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీయడం..! ఆ తర్వాత బెదిరించడం..!

భారత్ న్యూస్ విజయవాడ…మగవాళ్ళను ట్రాప్ చేయడం..బిజినెస్ పేరుతో ముంచేయడం.. సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీయడం..! ఆ తర్వాత బెదిరించడం..!

ఓ కిలాడీ లేడీని హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..!

ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే మొత్తం ఎనిమిది కేసులు ఉన్నట్లు తెలుస్తోంది..!

ఇదే విషయాన్ని పోలీస్ అధికారులు ధృవీకరించారు…

సూర్యాపేట జిల్లా పరిధిలోని ఒక పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను రెండవ వివాహం చేసుకున్న సదరు కిలాడీ లేడీ… సొంత పనులకోసం వచ్చే కారు డ్రైవర్ ను కూడా మభ్య పెట్టీ అతనివద్ద లక్షలు కాజేసినట్లు తెలిసింది..!

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు.. పోలీస్ అధికారులు కూడా ఈమె ట్రాప్ లో పడి లక్షలు పోగొట్టుకున్నారని.. వాళ్ళతో ఉన్న సమయంలో రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది..!