కానిస్టేబుళ్ళు గా ఎంపికైన 138 మంది అభ్యర్థులు శిక్షణ నిమిత్తం ఈ రోజు విజయనగరం శ్రీకాకుళం శిక్షణ

భారత్ న్యూస్ డిజిటల్: కృష్ణాజిల్లా:

కానిస్టేబుళ్ళు గా ఎంపికైన 138 మంది అభ్యర్థులు శిక్షణ నిమిత్తం ఈ రోజు విజయనగరం శ్రీకాకుళం శిక్షణ కేంద్రాలకు వెళుతుండగా వారికి జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ వి వి నాయుడు గారు, అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ శ్రీ బి. సత్యనారాయణ గారు సమావేశం నిర్వహించి శిక్షణ కేంద్రంలో పాటించవలసిన నియమ నిబంధనలు మెలకువలకు గురించి తెలియజేశారు.

పురుష అభ్యర్థులు శ్రీకాకుళం డిటిసికి 97, మహిళా అభ్యర్థులు 41 మంది విజయనగరం పీటీసీ కు సివిల్ కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికైన మీరంతా 9 నెలల శిక్షణ నిమిత్తం వెళుతున్న ఇప్పుడు పోలీస్ కుటుంబంలో సభ్యులుగా చేరుకున్నారని, మీరు విజయవంతంగా శిక్షణను పూర్తి చేసుకుని విధుల్లోకి జాయిన్ అవ్వాలని, మీ శిక్షణ నిమిత్తం అన్ని రకాలైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

▪️పోలీసు వ్యవస్థ లోకి నూతనంగా ప్రవేశిస్తుండగా శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ పొందాలని సూచించారు

▪️ పోలీసు ఉద్యోగం అంటేనే సేవా చేసే విభాగం. ఆపద వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది పోలీసే అని, జీతానికి కాకుండా సమాజానికి సేవ చేయాలని మీరు సంపాదించుకున్న ఉద్యోగానికి సార్ధకత తీసుకురావాలని తెలిపారు.

▪️ మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సైబర్ క్రైమ్, ఇతర నేరాల చేదనకు మెలకువలు నేర్చుకోవాలని తెలిపారు.

▪️పోలీస్ ఉద్యోగం అంటే క్రమశిక్షణ, నీతి, నిబద్ధత, నిజాయితీకి మారుపేరు. కాబట్టి మీరంతా కుటుంబ వాతావరణన్ని ఆలోచనలో నుండి తీసివేసి పోలీస్ ఉద్యోగానికి తగినట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకోవాలని విజయవంతంగా శిక్షణను పూర్తి చేసుకోవాలని తెలిపారు.

▪️ఈ కార్యక్రమంలో బందరు డిఎస్పి సిహెచ్ రాజా గారు, ఇతర పోలీసు అధికారులు ట్రైనింగ్ అభ్యర్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.