తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రను చేధించిన తిరుపతి పోలీసులు

భారత్ న్యూస్ తిరుపతి.తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రను చేధించిన తిరుపతి పోలీసులు

కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్ల కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు

వైసీపీ నేతలు, సాక్షి ప్రతినిధులు కలిసి కుట్ర చేసినట్లు ఆధారాలతో సహా వెల్లడి

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా కుట్రపూరితంగానే మద్యం బాటిళ్లను గెస్ట్ హౌస్ పడేశారని దర్యాప్తులో వెల్లడి

వైసీపీ అధికారిక మీడియా సాక్షి ప్రతినిధులతో కలిసి తిరుపతి వైసీపీ నేతలే కుట్రను అమలు చేసినట్టు అధారాలు

తిరుమల పవిత్రతను దెబ్బతీసి…టీటీడీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు నీచానికి పాల్పడిన వైసీపీ

ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ఏకంగా శ్రీవారి క్షేత్రంలోనే నీచమైన కుట్రలు చేసిన వైసీపీ మూకలు

సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ రిపోర్ట్, నిందితుల వాహనాల రాకపోకలు, ఫోన్ సిగ్నల్స్ సహా ఇతర టెక్నాలజీని వినియోగించి నిందితుల కుట్రను చేధించిన తిరుపతి పోలీసులు

మద్యం సీసాలపై ఉన్న ఆధారాలతో బాటిళ్లు కొనుగోలు చేసిన వైన్ షాపుల నుంచి ఆధారాల సేకరణ

కుట్ర కేసులో ఇద్దరు అరెస్ట్… అరెస్ట్ అయిన వారిలో వైసీపీ కార్యకర్త కోటి, సాక్షి మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణ

పరారీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్

కుట్ర వెనుక ఉన్న మొత్తం నెట్వర్క్ ను చేధిస్తున్న పోలీసులు

అరెస్టు చేసిన వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టి వాస్తవాలు వెల్లడించిన పోలీసులు

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు