తిరువూరు పట్టణంలోని NSP కాలనీ వద్ద అక్రమంగా గంజాయి (Cannabis) ను తరలిస్తున్న

భారత్ న్యూస్ రాజమండ్రి….ఎన్టీఆర్ జిల్లా

తిరువూరు:

తిరువూరు పట్టణంలోని NSP కాలనీ వద్ద అక్రమంగా గంజాయి (Cannabis) ను తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను తిరువూరు సీఐ గిరిబాబు గారు, ఎస్సై సత్యనారాయణ గారి సారథ్యంలో పోలీసు బృందం అరెస్ట్ చేయడమైంది.

అరెస్ట్ చేయబడ్డ నిందితులు వివరాలు ఇవే:

  1. కోట ఆకాష్ @ ఆసి, S/o కిషోర్, వయస్సు: 20 సంవత్సరాలు, కులము: మాదిగ, రాజుపేట, తిరువూరు పట్టణం.
  2. నాగుల వైష్ణవ్ కుమార్ @ చందు, S/o చెన్నకేశవులు, వయస్సు: 19 సంవత్సరాలు, కులము: గౌడ, పోలిశెట్టిపాడు గ్రామం, ఏ.కొండూరు మండలం.
  3. నాగవరపు కల్యాణ్ @ PK, S/o నాగరాజు, వయస్సు: 22 సంవత్సరాలు, కులము: రజక, నడిమి తిరువూరు, తిరువూరు పట్టణం.
  4. చావల రాజు @ తంబిరాజు, S/o కృష్ణ, వయస్సు: 24 సంవత్సరాలు, కులము: మాదిగ, చింతలకాలని, మధిర రోడ్, తిరువూరు పట్టణం.
  5. కంచపోగు వెంకటేశ్వరరావు @ వెంకీ, S/o కృష్ణ, వయస్సు: 24 సంవత్సరాలు, కులము: మాదిగ, అక్కపాలెం గ్రామం, తిరువూరు మండలం.

పోలీసుల దర్యాప్తులో NSP కాలనీ వద్ద పై ఐదుగురు వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఒక్కో కిలో చొప్పున గంజాయి పంచుకుంటుండగా పట్టుబడ్డారు. మొత్తం 5 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.

ఈ రైడ్‌ను తహసీల్దార్ శ్రీ ఉదయ భాస్కర్ గారు మరియు VRO లు సత్తార్, నాగుల్ మీరా గారి సమక్షంలో నిర్వహించారు.

నిందితులపై NDPS (Narcotic Drugs and Psychotropic Substances) చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

తిరువూరు పోలీసులు చట్టబద్ధంగా మత్తుపదార్థాల అక్రమ రవాణాపై పటిష్టంగా వ్యవహరిస్తామని, ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు.మరియు ఇటువంటి గంజాయి మరియు తదితర మత్తు పదార్దాల సమాచారం తెలిస్తే పోలీస్ వారికి తెలియ చేయాలనీ సీఐ గారు తెల్పిన్నారు…