పాముతో బెదిరించి.. ఏడుస్తూ క్షమాపణ చెప్పి..

…భారత్ న్యూస్ హైదరాబాద్….పాముతో బెదిరించి.. ఏడుస్తూ క్షమాపణ చెప్పి..

TG: హైదరాబాద్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికి పాముతో బెదిరింపులకు దిగిన వ్యక్తి కాళ్లబేరానికొచ్చాడు. నిందితుడు సయ్యద్ ఇర్ఫాన్(23)ను అరెస్టు చేసి పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. తాను చేసింది తప్పు అని, ఇకపై ఎప్పుడూ అలాంటి పనులు చేయబోనని వేడుకున్నాడు. మద్యం కూడా సేవించనని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో SMలో వైరలవుతోంది.