భారత్ న్యూస్ గుంటూరు….గుంటూరు జిల్లా పోలీస్…
// కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్గనైజింగ్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు,.//
గుంటూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం వారు అసాంఘిక మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు.
దీనిలో బాగంగా నిన్నటి (30.11.2025)రోజు రాత్రి టాస్క్ ఫోర్స్ బృందానికి రాబడిన సమాచారం మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గాంధీ పార్క్ వెనుక ఉన్న రామిరెడ్డి నగర్ లోని ఒక లాడ్జిలో ఆర్గనైజింగ్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు అనే సమాచారాన్ని SB CI గారి ద్వారా గౌరవ ఎస్పీ గారికి తెలియపరచి, ఎస్పీ గారి ఆదేశాల మేరకు లాడ్జ్ పై ఆకస్మిక దాడి నిర్వహించి ముగ్గురు(03)మహిళలు, నలుగురు(04) పురుషులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 07 సెల్ ఫోన్లను సీజ్ చేసి, తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

జిల్లాలో అసాంఘిక మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని గౌరవ ఎస్పీ గారు హెచ్చరించారు.