వీటికి భిన్నంగా ఒక పోలీస్ అయితే ఏకంగా డీజీపీ తాలూకా అని నెంబర్ ప్లేట్ పై రాయటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

భారత్ న్యూస్ విజయవాడ…గుంటూరు జిల్లా
మంగళగిరి

నువ్వు సూపర్ రా బుజ్జి అన్నట్లుగా ఉన్నాడు ఈ పోలీస్…

సాధారణంగా ద్విచక్ర వాహనాలపై నెంబర్ ప్లేట్లు మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా అని చూసి ఉంటాము..
వీటికి భిన్నంగా ఒక పోలీస్ అయితే ఏకంగా డీజీపీ తాలూకా అని నెంబర్ ప్లేట్ పై రాయటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

మరి ఆవాహన ఎక్కడో లేదండి తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద కనిపిస్తుంది..

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద బందోబస్తు నిర్వహించేందుకు అనంతపూర్ ఏపీఎస్పీ 14 బెటాలియన్ కు చెందిన పోలీస్ ఐతే ఏకంగా తన ద్విచక్ర వాహనంపై ఏపీ డీజీపీ తాలూకా రాయటం సూపర్ లకు ఆశ్చర్యం కలిగిస్తుంది.

సాధారణంగా పోలీస్ తనిఖీలలో నెంబర్ ప్లేట్ పై ఒక్క నెంబర్ తప్ప మరి ఏదీ ఉండకూడదని ఒక రూల్ అయితే ఉంది మరి ఈ పోలీసు కు ఆ రూల్ వర్తించదా అంటూ అటుగా వెళ్లే వాహనదారులు అంటున్నారు.

పోలీసులు తనిఖీ చేస్తున్నప్పుడు నెంబర్ ప్లేట్లు పై ఏమన్నా ఉంటే ఫైన్ వేస్తారు ఈ పోలీస్ పై ఫైన్ వేయాలంటే ఇతను మరి డిజిపి తాలూకా అని ఎవరు ఫైన్ వేయటం లేదు ఏమో మరి??
ఇది చక్రవాహను సాక్షాత్తు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద రోడ్డుపై ఉంటే ఎవరికి కనిపించలేదు మరి??

ఈ దృశ్యం బిగ్ టీవీకి కంటపడగా క్లిక్ మాన్పించారు ఓ ఫోటోతో

అటుగా వెళుతున్న వారు అయితే అందరికీ ఒక రూలా వీరికి ఏ రూల్ వర్తించదా అంటూ ఏం చేయాలో అర్థం కాక ఆ వాహనం చూస్తూ వెళుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ డిజిపి తాలూకా వాహన దారిని పై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు