మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు.

భారత్ న్యూస్ డిజిటల్:

కర్నూలు జిల్లా…

  • మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు.
  • రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.

ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతోపాటు జరిమానాలు తప్పవని, వాహనాదారులు జాగ్రత్తగా ఉండాలని కర్నూలు పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు.

మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్ల వల్ల సంభవించే ప్రమాదాలను నిరోధించేందుకు ఈ తనిఖీలు విస్తృతంగా చేపట్టారు.

అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేస్తున్నారు.

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

యువకులు మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ , ఉపాధి అవకాశాలకు కానీ పోలీసు వెరిఫికేషన్‌ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.