భారత్ న్యూస్ అనంతపురం…సైబర్ నేరాలపై ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసుల ప్రత్యేక అవగాహన!

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజ శేఖర బాబు ఐపీఎస్ గారి మేరకు సైబర్ క్రైమ్ డీసీపీ శ్రీమతి కృష్ణ ప్రసన్న IPS గారి ఆధ్వర్యంలో 227 బ్యాంకుల్లో సైబర్ టీమ్స్ ద్వారా సైబర్ సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సైబర్ సురక్ష కార్యక్రమంలో భాగంగా వివరించిన విషయాలు
“డిజిటల్ అరెస్ట్ అనేది లేనేలేదు!”
పోలీస్, సీబీఐ, ఈడీ, జడ్జీలు ఎవరూ వీడియోకాల్స్ ద్వారా బెదిరించారు, అరెస్టు చేశారు. ఇలాంటి కాల్స్‌కు భయపడవద్దు, స్పందించవద్దు. మోసపోయిన వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్: 1930 కు సంప్రదించాలని లేదా మీ సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించడమైనది.
ఆన్‌లైన్ పెట్టుబడుల మోసాలపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడి ప్రకటనలు నమ్మకూడదని, సరైన డీమ్యాట్ అకౌంట్ లేకుండా పెట్టుబడులు పెట్టొద్దని ఖాతాదారులకు అవగాహన కల్పించారు.

డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి!