.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో దాచిన కెమెరాలపై ‘షీ నేత్ర’ బృందాల ఏర్పాటు
మహిళల గోప్యతను కాపాడేందుకు హైదరాబాద్ పోలీసులు 7 ప్రత్యేక “షీ నేత్ర” బృందాలను ఏర్పాటు చేశారు. హోటళ్లు, మాల్స్, హాస్టళ్లు, విద్యాసంస్థల్లో తనిఖీలు చేపడతాయి.
అధునాతన కెమెరా డిటెక్టర్లతో ఈ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఎక్కడైనా అనుమానాస్పద పరికరాలు కనిపిస్తే వెంటనే 100/112 లేదా షీ టీమ్స్ హెల్ప్‌లైన్ 9490616555కు సమాచారం ఇవ్వాలని సూచించారు.