ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో గత రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో 7 గురు మృతి చెందారు.

భారత్ న్యూస్ రాజమండ్రి….ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో గత రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో 7 గురు మృతి చెందారు.

రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో 7 గురు మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని.

మృతులు రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందినవారిగా గుర్తించామని తెలిపారు.