భారత్ న్యూస్ హైదరాబాద్….బస్సులో సజ్జనార్ ప్రయాణం.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా భారీ ప్లాన్….
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. షేక్‌పేట్ ఫ్లైఓవర్ నుంచి మసబ్ ట్యాంక్ వరకు ఉన్న మార్గాన్ని మోడల్ కారిడార్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఐపీఎస్ అధికారి సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ స్వయంగా బస్సులో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, తక్షణమే పరిష్కార మార్గాలు చూపాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ చర్యల ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణాన్ని సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు…..
