పల్సర్ బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

భారత్ న్యూస్ విశాఖపట్నం..పల్సర్ బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

తూర్పుగోదావరి జిల్లా…

దేవరపల్లి మండలం యర్నగూడెం హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఏలూరు వెళ్తున్న సమయంలో పల్సర్ బైక్ ను ఢీ కొన్నసంఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న యర్నగూడెం గ్రామానికి చెందిన పెయింటర్స్ కోడూరి రాజేష్ కట్టా కిరణ్ లకు గాయాలు అయ్యాయి ఇద్దరినీ అంబులెన్స్ పై గోపాలపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు
బస్సులో ఉన్న70మంది ప్రయాణీకులను మరొక బస్సులో పంపించారు

సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టిన దేవరపల్లి పోలీసులు…