ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ( RSASTF )

భారత్ న్యూస్ అనంతపురం…ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ( RSASTF )

  • 📍అన్నమయ్య జిల్లాలో 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
  • 📍ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు

అన్నమయ్య జిల్లా కేవీ బావి అటవీ ప్రాంతంలో 10ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ ఐ సాయి గిరిధర్ కు చెందిన ఏఆర్ఎస్ఐ మహేశ్వర నాయుడు టీమ, స్థానిక ఎఫ్బీఓ నాగేశ్వర నాయక్ తో కలసి కోడూరు పరిధిలోని కెవి బావి ఆటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున నొక్కోడి గుండం వద్ద కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించారు. దీంతో టాస్క్ ఫోర్స్ టీమ్ వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేసింది. అయితే వారు తప్పించు కుని పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకో గలిగారు. వారి నుంచి 10ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వారిని దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వారిని డీఎస్పీ వీ శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె శ్రీనివాస్ విచారించగా, సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.