భారత్ న్యూస్ అనంతపురం .. …SBI బ్యాంకులో భారీ దోపిడీ
శ్రీసత్యసాయి జిల్లాలోని తూముకుంట పారిశ్రామికవాడలో ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం రాత్రి దుండగులు భారీ దోపిడీ చేశారు.కిటికీ కోసి లోనికి వెళ్లి సీసీ కెమెరా వైర్లు కట్ చేసి, లాకర్ తాళాలు విరిచి రూ.38 లక్షలు, 10 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఘటన బయటపడగా, DCPమహేశ్,SIఅబ్దుల్ కరీం ఆధారాలు సేకరించారు..
