హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణంతకం టూ వీలర్ మీద ప్రయాణించే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి

భారత్ న్యూస్ కడప ….హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణంతకం టూ వీలర్ మీద ప్రయాణించే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి


ఎస్సై కేవీజీవి…!

ఎన్టీఆర్ జిల్లా

తిరువూరు

గౌరవ సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డీసీపీ మహేశ్వర రాజు పర్యవేక్షణలో ఏసీపీ ప్రసాదరాజు సూచనలతో సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కే వి జి వి సత్యనారాయణ స్థానిక బోసుబొమ్మ సెంటర్ లో వాహన తనిఖీలు నిర్వహించి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారికి అపరాధ రుసుము విధించి వాహనదారులకు అవగాహన కల్పించి హెల్మెట్ లేని ప్రయాణం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అనేకమంది యువకులు చనిపోయారని, మరి కొంతమంది కుటుంబ పెద్దలను కోల్పోతున్నారని,ఎక్కువ మంది వాహనదారులు హెల్మెట్ లేకుండా మరియు యువత తాగి డ్రైవ్ చేయడం వలన ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిస్తున్నారని,కాబట్టి టు వీలర్ మీద ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెంట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసి ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు.

అలాగే గ్రామాల్లో కొంతమంది రైతులు వారి పశువులను వదిలేయడం వలన రాత్రి సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగుతున్నాయని కాబట్టి పాడిపశువులు గేదెల గాని ఆవులు కానీ వదిలే సమయం లో వాటి కొమ్ములకు రేడియం స్టిక్కర్లు అంటించటం వలన రాత్రి సమయంలో వాహనదారులకు పశువుల కొమ్ములకు వేసిన స్టిక్కర్లు కనిపించి ప్రమాదాలు చాలా వరకు మనం నివారించవచ్చని…. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లకు టు వీలర్ ఇవ్వరాదని, వాహనదారులు తప్పకుండా వ్యాల్యుబుల్ రికార్డ్స్ కలిగి ఉండాలని అన్నారు……

అనంతరం నూతన వాహన చట్టాల గురించి వివరిస్తూ…

హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 1035 రూపాయలు రూపాయలు ..!

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 10,000 రూపాయలు…!

మైనర్లకు టు వీలర్ డ్రైవింగ్ చేస్తే 7300…!

పొల్యూషన్ లేకుండా ఉంటే 1500…!
త్రిబుల్ రైడ్ డ్రైవింగ్ 5000 రూపాయలు…!

ఇన్సూరెన్స్ లేకుండా ఉంటే 2300…!
ఈ విధంగా ఫైన్ లు విధించటం జరుగుతుందని ఎస్సై కేవీజీవీ సత్యనారాయణ తెలిపారు….!