ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మీకోసం.

భారత్ న్యూస్ విజయవాడ…ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మీకోసం.జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

  • జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

:

కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని ఈనెల 6 తేదీ సోమవారం యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు తమ తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ లలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ న్యాయం కోరుతూ అర్జీలు అందజేయవచ్చునున్నారు. మీకోసం లో అందిన ప్రతి అర్జీని చట్ట పరిధిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా కోరారు.