ఎక్సైజ్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు..

భారత్ న్యూస్ డిజిటల్ : హైదరాబాద్:

ఎక్సైజ్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు..

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.

సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ కార్యాలయం అవరణలో జాతీయ పతాకావిష్కరణ చేశారు.

గణతంత్ర వేడుకలకు కమిషనర్ రావడంతో ఎక్సైజ్ అధికారులు స్వాగతం పలికారు.

అనంతరం కమిషనర్‌కు పోలీసులు గౌరవ వందనం చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనర్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, జాయింట్ కమిషనర్ సురేష్ రాథోడ్ కమిషనర్‌తో జాతీయ జెండా విష్కరణలో పాల్గొన్నారు.

డిప్యూటి కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరిండెంట్‌లు, ఎస్టీఎఫ్, డీటీఎఫ్ టీమ్‌లు , ఇతర కార్యాలయం సిబ్బంది గణతంత్ర వేడుకల్లో పాల్గోన్నారు.