…భారత్ న్యూస్ హైదరాబాద్….…సైబర్ క్రైమ్‌లో రేణు దేశాయ్ ఫిర్యాదు
Mar 02, 2026,
నటి రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని, తన వ్యక్తిగత జీవితం, పిల్లల గురించి నీచంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల అంశంపై మాట్లాడినప్పటి నుంచి కొందరు తనను లక్ష్యంగా చేసుకుని, రాయలేని భాషలో కామెంట్స్ పెడుతున్నారని, అసభ్యకరమైన మీమ్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిపారు.
