మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితునికి మరణించెంత వరకు జైలు శిక్ష (జీవిత కాలపు) మరియు 6,000/- రూపాయల జరిమానా విధించిన విజయవాడ, పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి వేల్పుల భవానీ గారు.

భారత్ న్యూస్ విజయవాడ…మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితునికి మరణించెంత వరకు జైలు శిక్ష (జీవిత కాలపు) మరియు 6,000/- రూపాయల జరిమానా విధించిన విజయవాడ, పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జి వేల్పుల భవానీ గారు.

నేరం జరిగి కేవలం 11 నెలల కాలంలో నిందితుడికి శిక్ష పడేలా చేసిన కృష్ణా జిల్లా పోలీసులు.

క్రైమ్ న్యూస్ కృష్ణా :

కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, మంటాడ గ్రామంలో ఫిర్యాది తన తల్లితో కలసి నివాసం ఉంటున్నట్లు, ఆమె తల్లి దండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ సంతానం అయినట్లు, తల్లి దండ్రులు మనస్పర్థల కారణంగా విడిపోయి ఇద్దరు ఆడపిల్లలు తల్లితోకలసి మంటాడ గ్రామం, ఇందిరమ్మ కాలనీ లో నివాసం ఉంటున్నట్లు, ఫిర్యాది తండ్రి మరియు అన్న కొమ్ము సౌల్ ఇద్దరు ప్రకాశం జిల్లాలోని, కొండెపి మండలం, పెట్లూరు గ్రామంలో ఉంటున్నట్లు, 2023 సంవత్సరంలో ఫిర్యాది అన్న సౌల్ తన తల్లి వద్దకు మంటాడ గ్రామం వచ్చి వెళ్ళినట్లు అప్పటినుండి తన తల్లి మరియు చెల్లి తో మాట్లాడుతున్న క్రమంలో ఫిర్యాదితో నువ్వు నాకు ముద్దు పెట్టుకున్న ఫోటోస్ ఉన్నాయని ఫిర్యాదిని బెదిరించి పలుమార్లు శారీరకంగా కలిసినట్లుగా అలాగే ది. 19.12.2024 క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఇంటికి తీసుకువెల్లకుండా విజయవాడలోని, గుణదల మేరీ మాత చర్చి కి తీసుకువెళ్ళి తాళికట్టి అనంతరం విజయవాడ బస్ స్టాండ్ వద్ద గల బాలాజీ లాడ్జి కి తీసుకువెళ్ళి శారీరకంగా కలిసినట్లు, తర్వాత అక్కడనుండి పెట్లూరు గ్రామం తీసుకెళ్ళి అక్కడ రెండు రోజుల తర్వాత ఫిర్యాది తండ్రి మరియు అన్న ఇద్దరు కలసి ఫిర్యాదిని పని నిమిత్తం అని చెప్పి హైదరాబాద్ లోని తుక్కుగూడ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉంటున్న క్రమంలో ఫిర్యాది అన్న తండ్రి లేని సమయంలో బలవంతంగా అనేక సార్లు శారీరకంగా కలిసినాడు.

కొంతకాలం తర్వాత ఫిర్యాది తల్లి పెట్లూరు గ్రామం వచ్చి కొడుకు సౌల్ కి ఫోన్ చేసి ఫిర్యాదిని పెట్లూరు గ్రామం పంపించమని చెప్పగా 07.02.2025 తేదీన ఫిర్యాది అన్న మరియు తండ్రి ఇద్దరు ఫిర్యాదిని హైదరాబాద్ నుండి తీసుకుని వచ్చి ఒంగోల్ బస్ స్టాండ్ లో దింపి హైదరాబాద్ వెళ్లిపోయారు. అంతటా ఫిర్యాదిని ఆమె చెల్లి మరియమ్మ మరియు పెదనాన్న కొడుకు రాజేష్ ఇద్దరు ఒంగోల్ బస్ స్టాండ్ కి వచ్చి ఫిర్యాదిని పెట్లూరు గ్రామంలోని ఇంటికి తీసుకువెళ్ళినారు. కొన్ని రోజుల తర్వాత ఫిర్యాదికి జ్వరం మరియు వాంతులు అవుతుండగా ఫిర్యాది తల్లికి అనుమానం వచ్చి ప్రెగ్నెంకి కిట్ తో పరీక్షించగా ప్రెగ్నెంట్ అని తెలిసినది.

అంతటా ఫిర్యాదిని ఏమి జరిగినది అని అడుగగా తన అన్న అయిన కొమ్ము సౌల్ ఫిర్యాదిని బెదిరించి వివాహం చేసుకుని పలుమార్లు బలవంతంగా శారీరకంగా కలిసినడని చెప్పినది. అంతట ఫిర్యాది తల్లి ఫిర్యాదిని వెంట పెట్టుకుని కొండెపి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వగా వారు జీరో fir నమోదు చేసి పమిడిముక్కల పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా ఎస్పి శ్రీ ది విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు పమిడిముక్కల పోలీస్ స్టేషన్ si B.శ్రీను గారు Cr.No. 39/2025 U/s. 64(2)(m), 65(1) BNS & Sec.6 of POCSO Act-2012 of Pamidimukkala PS కేసు గా నమోదు చేసినారు.

గుడివాడ సబ్ డివిజన్ DSP ధీరజ్ వినీల్ గారు కేసును దర్యాప్తు చేసి నిందితుడైన ప్రకాశం జిల్లా, కొండెపి మండలం, పెట్లూరు గ్రామానికి చెందిన కొమ్ము సౌల్ (21 సం.) ను అరెస్ట్ చేసి కోర్ట్ లో కేవలం 60 రోజుల లోపు చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది.

రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారి ఆదేశాల మేరకు ఇటువంటి కేసులను తీవ్ర నేరంగా పరిగణించి Conviction based trail monitoring పద్దతిలో త్వరితగతిన ట్రయిల్ ను పూర్తి అయ్యేవిధంగా మరియు నిందితుడికి శిక్ష పడేలాగా చేయాలని అధికారులకు మరియు సి.ఎం.ఎస్. సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, గుడివాడ సబ్ డివిజన్ డిఎస్పి గారి పర్యవేక్షణ లో పమిడిముక్కల సిబ్బంది మరియు సి.ఎం.ఎస్.సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో POCSO Court (స్పీడీ ట్రయిల్ కోర్ట్) నందు త్వరితగతిన ట్రయిల్ నిర్వహించడం జరిగింది.

విచారణ అనంతరం నిందితుడిపై నేరం ఋజువైనందున ది.09.02.2026 వ తేదీన విజయవాద POCSO Court, జడ్జి వేల్పుల భవానీ గారు నిందితుడు కొమ్ము సౌల్ (21 సం.) కి * మరణించెంత వరకు జైలు శిక్ష (జీవితకాలపు జైలు శిక్ష) మరియు 6,000/- రూపాయల జరిమానా విధిస్తూ, సదరు బాధిత బాలికకు జరిమానా నుండి 30,000/- రూపాయలను మరియు రూ.5.00,000/- నష్టపరిహారం వచ్చేవిధంగా చూడాలని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సర్వీస్ అధారిటీ వారిని ఆదేశించడం జ…