రామగుండం పోలీస్ కమీషనరేట్

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..రామగుండం పోలీస్ కమీషనరేట్

(Cr.No.219/2025, U/sec.318(4), 316(5), 314, 61(2)(b), 306, 317(2) r/w 49 BNS and Sec 65, 66(c), 66(D) of IT Act of PS Chennur)

📍అరెస్టయిన నిందితులు మొత్తం సంఖ్య :: 44 (ఇందులో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు)

రికవరీ అయిన బంగారు నగలు :: 15.237 కిలోల బంగారు ఆభరణాలు

రికవరీ అయిన నగదు :: రూ.1,61,730/-

2025 ఆగస్టు 23వ తేదీ ఉదయం 10.00 గంటల సమయంలో, శ్రీ రితేష్ కుమార్ గుప్తా, రీజినల్ మేనేజర్, ఎస్బీఐ చెన్నూర్ పీఎస్ చెన్నూర్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం బ్యాంకులో 402 గోల్డ్ లోన్ ఖాతాల ఆభరణాలు (25.17 కిలోల బంగారం) విలువ రూ.12.61 కోట్లు మరియు నగదు రూ.1.10 కోట్లు దుర్వినియోగం చేయబడి, దొంగిలించబడ్డాయి.

ఈ ఫిర్యాదు అందుకున్న వెంటనే రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, శ్రీ ఏ. భాస్కర్, ఐపీఎస్ డీసీపీ మంచిర్యాల్ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు బాధ్యతను శ్రీ ఏ. వెంకటేశ్వర్, ఏసీపీ జైపూర్‌కు అప్పగించారు.

దర్యాప్తు అధికారి మరియు ప్రత్యేక బృందాలు బ్యాంకును తనిఖీ చేసి, సాంకేతిక ఆధారాలను సేకరించి, క్యాషియర్ నరిగె రవీందర్ ఖాతాలో ఆడిట్ నిర్వహించగా భారీగా అనుమానాస్పద డిపాజిట్లు ఉన్నట్లు తేలింది.

ప్రధాన నిందితుడు నరిగె రవీందర్ (క్యాషియర్)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆయన చెప్పిన ప్రకారం అక్టోబర్ 2024కు ముందే ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. తన నష్టాన్ని పూడ్చుకోవడం కోసం మరియు మరింత బెట్టింగ్ కొనసాగించడానికి బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కలిసి మోసానికి పాల్పడ్డాడు. బ్యాంక్ కరెన్సీ ఛెస్ట్ యొక్క తాళం మేనేజర్ మరియు క్యాషియర్ సంయుక్త ఆధీనంలో ఉండేది. మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ తన తాళాన్ని క్యాషియర్‌కు ఇచ్చినాడు. దాన్ని ఉపయోగించుకుని, నరిగె రవీందర్, క్యాషియర్, మేనేజర్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సహకారంతో బంగారం, నగదు దొంగిలించేందుకు పథకం రచించాడు.

అక్టోబర్ 2024 నుండి తరచూ గోల్డ్ లోన్ చెస్ట్ నుండి బంగారం తీసి, తన స్నేహితులు – కొంగోండి బీరష్ (సేల్స్ మేనేజర్, SBFC మంచిర్యాల), కొడాటి రాజశేఖర్ (కస్టమర్ రిలేషన్ మేనేజర్, SBFC మంచిర్యాల), బొల్లి కిషన్ (సేల్స్ ఆఫీసర్, SBFC మంచిర్యాల్)కు అప్పగించేవాడు. వీరు ఆ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి, డబ్బును తమ ఖాతాల్లో జమ చేసి, కొంత కమిషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని క్యాషియర్ రవీందర్‌కి బదిలీ చేసేవారు.

ఇప్పటివరకు నిందితులు 10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపెనీలలో (SBFC, Indel Money, Muthoot Finance Ltd., Godavari Urban, Manappuram, Muthoot Fincorp, Muthoot Mini) 44 మంది పేర్లపై 142 గోల్డ్ లోన్లు తీసుకున్నారు.

అలాగే, క్యాషియర్ నరిగె రవీందర్ బ్రాంచ్ మేనేజర్‌తో కుమ్మక్కై తన భార్య, మరిది మరియు స్నేహితుల పేర్లతో తప్పుడు గోల్డ్ లోన్లు 42 మంజూరు చేసి, బంగారం లేకుండానే రూ.1.58 కోట్లు (అంటే 4.14 కిలోల బంగారం తాకట్టు పెట్టినట్లు చూపించారు) విత్‌డ్రా చేసుకున్నాడు. అంటే వాస్తవ నష్టం 21 కిలోల బంగారం విలువ.

అలాగే క్యాషియర్ రవీందర్, ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే సమయంలో కూడా డబ్బు అపహరించేవాడు.

దర్యాప్తు అధికారి ఇప్పటివరకు 3 బ్యాంకు అధికారులు మరియు వారికి తోడ్పడిన 41 మందితో కలిపి మొత్తం 44 నిందితులను అరెస్టు చేశారు.

ఈ కేసులో ఇప్పటివరకు SBFC, Indel Money, Godavari Urban, Muthoot Mini మరియు IIFL నుంచి 15.23 కిలోల బంగారు నగలు రికవరీ అయినాయి. మిగతా బంగారు ఆభరణాలు Muthoot Finance Ltd., Manappuram Mancherial, Muthoot Fincorp, Muthoot Fin Chennur మరియు Muthoot Mini Chennurలో నుంచి రికవరీ చేయబడవలసి ఉంది. గోల్డ్ లోన్ కంపెనీ మేనేజర్ ల పాత్ర పై విచారణ జరుగుతుంది.

నిందితుల వివరాలు :

A1. నరిగె రవీంధర్, S/o మల్లయ్య, వయస్సు 32 సంవత్సరాలు, కులం: కురుమ, Occ: SBI-02 బ్రాంచ్‌లో క్యాషియర్ చెన్నూర్, R/o షెట్‌పెల్లి గ్రామం, జైపూర్ మండలం,

A2. వెన్నపురెడ్డి మనోహర్, S/o లచ్చి రెడ్డి, వయస్సు 34 సంవత్సరాలు, కులం: రెడ్డి, Occ ; బ్రాంచ్ మేనేజర్, SBI బ్రాంచ్-02, చెన్నూర్. R/o ముత్తరావుపల్లి గ్రామం, చెన్నూరు

A3. లక్కాకుల సందీప్, S/o లచ్చన్న, వయస్సు 28 సంవత్సరాలు, కులం : మున్నూరు కాపు, Occ : అటెండర్, SBI-02 బ్రాంచ్ చెన్నూర్‌లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి, R/o H.No.11-31/8 గోదావరి రోడ్డు, చెన్నూర్,

A4. కొంగొండి బీరేష్, S/o రాజయ్య, వయస్సు 28 సంవత్సరాలు, కులం: కురుమ, Occ: సేల్స్ మేనేజర్, SBFC మంచిరియల్, R/o షెట్పెల్లి గ్రామం జైపూర్ మండలం.

A5. కోదాటి రాజశేఖర్, S/o స్వామి, వయస్సు 30 yrs కులం : SC మాల, Occ : కస్టమర్ రిలేషన్ మేనేజర్, SBFC గోల్డ్ లోన్ ఫైనాన్స్, మంచిరియల్, R/o రామకృష్ణాపూర్

A6. బొల్లి కిషన్ కుమార్, s/o. లక్ష్మయ్య, వయస్సు 30 సంవత్సరాలు, కులం మాదిగ, SBFC, మంచిర్యాలలో occ సేల్స్ ఆఫీసర్, r/o. H.No.13-102, B-జోన్, రామకృష్ణపూర్,

A7. ఉమ్మాల సురేష్, S/o S/o గట్టయ్య, వయస్సు 23 సంవత్సరాలు, కులం: కురుమ, Occ: ఫోటోగ్రాఫర్, R/o శెట్పెల్లి గ్రామం, జైపూర్ మండలం,

A8. నడిగొట్టు సాగర్, s/o. నారాయణ, వయస్సు 29 సంవత్సరాలు, కులం మంగలి, Occ ప్లంబింగ్ పని, r/o. H.No. 12-116/8, రోడ్ నెం-3, రాళ్లపేట్, మంచిర్యాల ,

A9. రాంశెట్టి చంద్రబాబు, s/o. సీతాపతి, s/o. వయస్సు 32 సంవత్సరాలు, కమ్మ కులం, occ ప్రైవేట్ ఉద్యోగి, r/o. H.No. 13-302, శాంతినగర్ కాలనీ, రామకృష్ణపూర్,

A10. భరతపు రాకేష్, s/o. శంకర్, వయస్సు 29 సంవత్సరాలు, కులం మున్నూరుకాపు, occ ప్రైవేట్ ఉద్యోగి (ప్రైవేట్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్), r/o. H.No. 13-291, శాంతినగర్ కాలనీ, రామకృష్ణపూర్,

A11. దిగుట్ల సునీల్, s/o.వెంకటేష్, వయస్సు 22 సంవత్సరాలు, కులం కుమ్మరి, Occ సెంట్రింగ్ పని, r/o. H.No. 17-56, లక్ష్మీనగర్, మంచిర్యాల,

A12. కడం రమేష్, S/o మల్లయ్య, వయస్సు 36 సంవత్సరాలు, కులం : 36 సంవత్సరాలు, R/o రామకృష్ణాపూర్ గ్రామం

A13. దారపు నాగరాజు, s/o. రాజయ్య, వయస్సు 30 సంవత్సరాలు, కులం తెనుగు, Occ ప్రైవేట్ ఉద్యోగి, r/o. H.No. 24-337-2, బృందావన్ కాలనీ, మంచిర్యాల