పేకాట ఆడిన పోలీసుల్ని సస్పెండ్ చేసిన ఎస్పీ

భారత్ న్యూస్ గుంటూరు…పేకాట ఆడిన పోలీసుల్ని సస్పెండ్ చేసిన ఎస్పీ

పేకాట ఆడుతూ పట్టుబడిన పోలీసులను గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సస్పెండ్ చేశారు. పెదకాకాని ఏఎస్ఐ వెంకట్రావు, గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాధాకృష్ణ, తుళ్లూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ గత కొద్దిరోజుల క్రితం ఓ హోటల్లో పేకాట ఆడారని చెప్పారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉల్లంఘించడంతో వారిని సస్పెండ్ చేశామని ఎస్పీ తెలిపారు.