పోలీస్ మామలు’ అంటూ వాట్సాప్ గ్రూప్.. SI ఎంట్రీతో షాక్!

భారత్ న్యూస్ వరంగల్….. …‘పోలీస్ మామలు’ అంటూ వాట్సాప్ గ్రూప్.. SI ఎంట్రీతో షాక్!

Apr 04, 2026,

తెలంగాణ ; పెద్దపల్లి(D) గోదావరిఖనిలో పోలీసులు తనిఖీల నుంచి తప్పించుకునేదుకు కొందరు మందుబాబులు ‘పోలీస్ మామల స్క్వాడ్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ సృష్టించారు. అయితే డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఒక వ్యక్తి ఫోన్‌ను తనిఖీ చేయగా ఈ గ్రూప్ వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ గ్రూప్‌లో SI జాయిన్ అయి.. ‘మామలూ.. మీ నంబర్లన్నీ సేవ్ చేసుకున్నా. త్వరలో కౌన్సెలింగ్ ఇస్తా’ అంటూ హెచ్చరించడంతో గ్రూప్ సభ్యులు షాక్ అయ్యారు. ఎవరూ టెన్షన్ పడవద్దని, గ్రూపు సభ్యులందరికీ అవేర్నెస్ కల్పిస్తానని SI సూచించడం గమనార్హం.