భారత్ న్యూస్ విజయవాడ…పేకాట గ్యాంగ్‌పై పోలీసుల దాడి – ఆరుగురు అరెస్ట్
రూ 5,550 నగదు, బైక్ సీజ్
పేకాట చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై చిరుమామిళ్ల వెంకట్
పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు.

మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నకాకాని గ్రామ శివారు ప్రాంతాల్లో పేకాట నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంపై మంగళగిరి రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. గ్రామ పొలాలు శివారు, ఎన్నారై బ్యాక్‌సైడ్ ఖాళీ ప్రదేశాల్లో కొంతకాలంగా పేకాట సాగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోగ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ఆధ్వర్యంలో పోలీసులు బృందంగా వెళ్లి తనిఖీలు చేపట్టగా, అక్కడ పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.5,550 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అదేవిధంగా ఘటన స్థలంలో ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన వారిపై చట్టా ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. పేకాట వంటి అక్రమ కార్యకలాపాలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు, చట్ట వ్యతిరేక చర్యలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్ఐ వెంకట్ హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతలను భంగం కలిగించే పేకాట, జూదం వంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు యువతను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉన్నదని ఆయన తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో జరుగుతున్న అనుమానాస్పద లేదా అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజల సహకారం అవసరమని ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ పేర్కొన్నారు.