రేప్ కేసులో నిందితుడిని నడిరోడ్డుపై నడిపించి, కోర్టులో హాజరుపరచిన పొన్నూరు టౌన్ పోలీసులు,

భారత్ న్యూస్ డిజిటల్:గుంటూరు,:

పొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్
తేది : 19.12.2025

/రేప్ కేసులో నిందితుడిని నడిరోడ్డుపై నడిపించి, కోర్టులో హాజరుపరచిన పొన్నూరు టౌన్ పోలీసులు,//
పొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కాలనీలో నివాసముంటున్న మహిళపై జరిగిన ఘోర అత్యాచార నేరానికి సంబంధించి, నిందితుడిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పొన్నూరు టౌన్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా చట్ట వ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పొన్నూరు టౌన్ సీఐ శ్రీ వీరా నాయక్ గారు హెచ్చరించారు.
ది.18.12.2025 రాత్రి సమయంలో నల్లమోతు వర కుమార్ (వయస్సు: 19 సంవత్సరాలు), చింతలపూడి గ్రామం, పొన్నూరు మండలం అనే నిందితుడు అక్రమంగా ఒక మహిళ నివాసంలోకి చొరబడి, కత్తితో ఆమెను బెదిరించి, గాయాలు కలిగించి, బలవంతంగా అత్యాచార నేరానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

👉 బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై Cr.No: 237/2025, U/s 64(1), 329(4), 118(1) – BNS Act కింద కేసు నమోదు చేసి, పొన్నూరు టౌన్ సీఐ శ్రీ వీరా నాయక్ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.

👉 దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి, ఇలాంటి ఘోర నేరాలకు పాల్పడే వారిపై చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో పొన్నూరు టౌన్ సీఐ గారు తన సిబ్బందితో కలిసి నిందితుడిని పొన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ నుండి నడిరోడ్డుపై నడిపిస్తూ, పొన్నూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు.

🚨 మహిళలు మరియు బాలికల భద్రత, రక్షణకు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలను ఏమాత్రం సహించబోమని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గారు స్పష్టం చేశారు.

👉 అలాగే మహిళలు, బాలికలపై ఎక్కడైనా నేరాలు జరిగినట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ అధికారులకు, డయల్ 112 నంబర్ ద్వారా సమాచారం అందించాలని ప్రజలను కోరారు.