గుంటూరు జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించిన పోలీస్ అధికారులు. – గంజాయి, మత్తు పదార్థాల రవాణా

భారత్ న్యూస్ రాజమండ్రి…భారత్ న్యూస్ డిజిటల్ :అమరావతి:

గుంటూరు జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించిన పోలీస్ అధికారులు. – గంజాయి, మత్తు పదార్థాల రవాణా మరియు ఇతర నేరాల అరికట్టడమే లక్ష్యం,.//

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి(21.12.2025) విస్తృతంగా “నాకాబందీ” నిర్వహించారు.దీనిలో బాగంగా 603 కేసులు నమోదు చేసి, రూ.4,27,832/- జరిమానా విధించారు.అదే విధంగా 31 అనుమానిత వాహనాలను సీజ్ చేశారు.
ఈ నాకాబందీ కార్యక్రమంలో భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేయడంతో పాటు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, అక్రమ ఆయుధాల తరలింపు వంటి ఇతర నేరాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నాకాబందీ సమయంలో అనుమానిత వ్యక్తులు మరియు అనుమానాస్పద వాహనాలను ఆపి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ వంటి ధ్రువ పత్రాలను పరిశీలించారు. అదేవిధంగా వాహనదారులు ప్రయాణిస్తున్న మార్గం, ప్రయాణ ఉద్దేశ్యం, గమ్యస్థానం గురించి ఆరా తీసి అవసరమైన చోట్ల హెచ్చరికలు జారీ చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.
గుంటూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి సంబంధించి ఈ నాకాబంధి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియను రాబోయే రోజుల్లో కూడా నిర్వహించి, ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని గుంటూరు జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ నాకాబంధి కార్యక్రమంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని వారు, వాహన ధ్రువ పత్రాలు లేని వారిపై పోలీస్ అధికారులు 603 కేసులు నమోదు చేసి, రూ.4,27,832/- జరిమానా విధించారు.అదే విధంగా 31 అనుమానిత వాహనాలను సీజ్ చేశారు. పెదనందిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 131 క్వార్టర్ బాటిళ్ల మద్యం సీసాలను సీజ్ చేసి, వాటిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని,పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.