ముగిసిన పోలీస్ మెగా వైద్య శిభిరం 1400 మందికి వైద్య చికిత్సలు వరంగల్

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ముగిసిన పోలీస్ మెగా వైద్య శిభిరం 1400 మందికి వైద్య చికిత్సలు

రెండు రోజుల పాటు నిర్వహించిన పోలీసులు వారి కుటుంబాలకు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిభిరంలో 1400 మందికి వైద్య చికిత్సలు అందించినట్లు వరంగల్ పోలీసు కమీషనర్ సన్రైత్ సింగ్ తెలిపారు. నవీన్ అడ్వాన్స్ న్యూరోకేర్ హాస్పిటల్, భగీరథ కార్డియాక్ కేర్ మేఘన మల్టీ స్పెషాలిటీ, మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిభిరంలో భగీరథ కార్డియాక్ కేర్ మేఘన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ భగీరథ డాక్టర్ మేఘన ముడిదే ఆధ్వర్యంలో పురుషులకు 400 మందికి 2డిఇకో, 400 మందికి ఇ.సి.జి. పరీక్షలు నిర్వహించగా 200 మంది మహిళలకు మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం 2డిఇకో, ఇ.సి.జి. పరీక్షలు 1400 మందికి మధుమేహ వ్యాధి పరీక్షలు నిర్వహించారు. 400మందికి డయాబెటిక్ న్యూరోపతి స్క్రీనింగ్ పరీక్షలను డాక్టర్ కొరివి నవీన్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించగా…. కార్డియో సంబందిత వ్యాది పరీక్షలు డాక్టర్ సంతోష్ మదాని ఆధ్వర్యంలో 250 మందికి పరీక్షలు నిర్వహించారు. వైద్య శిభిరాన్ని డి.ఎం.హెచ్.వో. డాక్టర్ అల్లం అప్పయ్య సందర్శించారు. సుమారు 5లక్షల విలువైన మందులను సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ద్వారా అందించారు. వైద్య శిభిరంలో డి.సి.పి. అంకిత్ కుమార్ తో పాటు వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రియాంక లతో పాటు జిల్లా సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఫార్మసి ఆఫీసర్ ఉప్పు భాస్కర్రావు వైద్య సిబ్బందితో పాటు అడిషనల్ డి.సి.పి.లు యం.సురేష్ కుమార్, బాలస్వామి, వేముల శ్రీనివాస్, రవి, ప్రభాకర్ రావు, ఎ.సి.పి.లు జాని నర్సింహులు, సురేందర్, డేవిడ్ రాజ్, జితేందర్ రెడ్డి, నాగయ్య, అనంతయ్య, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ సిబ్బందికి ఉచితంగా 50 వేల మాస్కులు
పొల్యూషన్లో నిత్యం విధి నిర్వహణలో పాల్గొంటున్న ట్రాఫిక్ పోలీసులకు సెంట్రల్ మెడిసిన్ స్టోర్, హనుమకొండ ద్వారా 50 వేల మాస్కులను ఉచితంగా అందించనున్నట్లు డి.యం.హెచ్.ఓ. డాక్టర్ అల్లం అప్పయ్య, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఫార్మసి ఆఫీసర్స్ ఉప్పు భాస్కర్ రావు, నళిని లు తెలిపారు. ఈ సందర్భంగా డి.యం. హెచ్.ఓ. ఫార్మసీ ఆఫీసర్లను పోలీసు కమీషనర్ సన్రైత్ సింగ్ అభినందించారు.