BHARATH NEWS DIGITAL: HYDERABAD:
భారీగా నిషేదిత గంజాయిని పట్టుకున్న భద్రాద్రి జిల్లా పోలీసులు మరియు RNCC KMM( తెలంగాణా ఈగల్ ఫోర్సు)
వాహన తనిఖీలలో కోటి యాబై లక్షల రూపాయల విలువ చేసే నిషేదిత గంజాయిని స్వాదీనం చేసుకున్న పోలీసులు
ఈ రోజు అనగా 24.12.2025 ఉదయము 10.00 గంటలకు విశ్వసనీయ సమాచారం మేరకు దమ్మపేట పోలీసులు మరియు Telangana Eagle team RNCC Khammam సంయుక్తముగా దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చుతా పురం క్రాస్ రోడ్ లో నిర్వహించిన వాహన తనిఖీలలో రాజముండ్రి వైపు నుంచి సతుపల్లి వైపుకు వెళ్తున్న TATA MOTOR GOODS CONTAINER బేరింగ్ నెంబర్ TN 73 AD 9515 LORRY మరియు మారుతి సుజుకి ఏర్టిగా కారు బేరింగ్ నెంబర్ MH 14 EC 5834, ఇట్టి కారుకు ఒక నకిలీ నెంబర్ ప్లేట్ : AP 14 EC 5834 ను ఆపి తనిఖీ చేయగా మొత్తం 152 గంజాయి పాకెట్ల (ఒక్కొక్కటి సుమారు 2 కిలోల బరువు ) మొత్తం నికర బరువు 304 కేజి ల గా వున్నది. దాని విలువ సుమారుగా కోటి యాబై రెండు లక్షలు (Rs.1,52,00,000/-) వున్న ప్రభుత్వ నిషేదిత గంజాయిని గుర్తించడం జరిగింది. ఇట్టి గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకోవడమైనది. కంటైనర్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులను మరియు ఎస్కార్ట్ వెహికల్ కార్ లో వున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది. కంటైనర్ క్రింది భాగంలో అనుమానం రాకుండా ఒక ప్రత్యేకమైన అర తయారు చేసి అందులో ఇట్టి గంజాయిని ప్యాకెట్ల రూపంలో దాచి పెట్టి ఒరిస్సా రాష్ట్రం లో బానందులి గ్రామము నందు సాదు గురుజి r/o చిత్రకొండ , ఒరిస్సా వద్ద కొనుగోలు చేసి సదరు నిషేధిత గంజాయిని లోడ్ చేసుకొని కారులో రాజముండ్రి వరకు తరలించి అక్కడ కంటైనర్ లో ప్రత్యేకమైన ( సీక్రేట్ ఛాంబర్ ) అర లో దాచి పెట్టి రాజముండ్రి, అశ్వారావుపేట, సతుపల్లి, వి. యమ. బంజర,విజయవాడ మీదుగా గంజాయి స్మగ్లర్ అయిన చెన్నై కు చెందిన విక్రమ్ వద్దకు కు తరలిస్తున్నట్లు సదరు వ్యక్తులు విచారణలో ఒప్పుకున్నారు.
ఇట్టి నిషేధిత గంజాయిని అమ్మిన వ్యక్తులపైన,కొనుగోలు చేసిన వ్యక్తులు మరియు రవాణా చేస్తున్న వ్యక్తులందరిపై కేసు నమోదు చేసి అట్టి రవాణాకు ఉపయోగించిన కంటైనర్, కారు ను మరియు అయిదు మొబైల్ ఫోన్లను మరియు వారి వద్ద వున్న నగదు 4500/- కూడా సీజ్ చేయడం జరిగినది.
Crime Number.326/2025 Under section : 8(C) r/w 20(b)(ii)(C), 27(A), 29 of NDPS ACT of PS Dammapeta
నేరము జరిగిన ప్రదేశము : అచ్చుతాపురం గ్రామ క్రాస్ రోడ్ వద్ద, దమ్మపేట మండలము
నేరము జరిగిన తేదీ మరియి సమయము: తేదీ.24-12-2025 న ఉదయం 10.00 గం.ల కు
ఫిర్యాది : B. సాయి కిషోర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, PS దమ్మపేట, మరియు సిబ్బంది
గంజాయి తరలించడానికి ఉపయోగించిన వాహనం :TATA MOTOR GOODS CONTAINER బేరింగ్ నెంబర్ TN 73 AD 9515 LORRY కంటైనర్ లో సీక్రెట్ ఛాంబర్ ని తయారు చేసి గంజాయి ని దాచిపెట్టి తరలిస్తున్నారు.
గంజాయి తరలించడానికి ఉపయోగించిన ESCORT వాహనం : మారుతి సుజుకి ఏర్టిగా కారు బేరింగ్ నెంబర్ MH 14 EC 5834, ఇట్టి కారుకు ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ : AP 14 EC 5834 ను ఫిక్స్ చేసినాడు ,అసలు నెంబర్ ప్లేట్ MH 14 EC 5834
గంజాయి తరలించడానికి ఉపయోగించిన సెల్ ఫోన్ లు/ ఐడి కార్డ్ : 5 సెల్ ఫోన్ లు.
పోలీసు తనిఖీ లలో పట్టుబడిన గజాయి : మొత్తం 152 గంజాయి పాకెట్ల (ఒక్కొక్కటి సుమారు 2 కిలోల బరువు ) మొత్తం నికర బరువు 304 కేజి ల గా వున్నది.
దాని విలువ సుమారుగా ఒక కోటి యాబై రెండు లక్షలు (Rs.1,52,00,000/-) (1 కేజీ 50,000)లుగా ఉంది.
పట్టుబడిన నిందితులు: నలుగురు
వంతల ఏమలయ్య తండ్రి .సన్నీ బాబు, వయస్సు . 29 సంవత్సరాలు, కులము కోడు, వృత్తి . కూలి R /o. కుడుములు వీడి , కోరుకొండ పోస్ట్, బలపం, చింతపల్లి , విశాకపట్నం , ఆంధ్రప్రదేశ్ (ట్రాన్స్పోర్టర్)
అర్జున్ బి. తండ్రి బాస్కర్, వయస్సు 25 సంవత్సరాలు, కులం అధిద్రవిడ, వృత్తి డ్రైవరు, r/o కాయల మేడు , పెరియా ఓబుళాపురం, పోస్ట్, పెరియబులాపురం, తిరువళ్లూర్ జిల్లా, తమిళనాడు. (ట్రాన్స్పోర్టర్)
షణ్ముగుం ఎం. తండ్రి మురుగేశన్, వయస్సు 28 సంవత్సరాలు, కులము ద్రవిడ, వృత్తి. స్టూడెంట్ r/o కాయలర్మేడు, చిన్నఓబులాపురం, పేర్లఓబులాపురం, తిరువళ్లూర్ జిల్లా, తమిళనాడు(ట్రాన్స్పోర్టర్)
దేవాకర్ తండ్రి విరాజ్ , వయస్సు 19 సంవత్సరాలు, కులము అధిద్రవిడ, వృత్తి. స్టూడెంట్ r/o పొందవక్కం, పల్లవడ, తిరువళ్లూర్ , తమిళనాడు (ట్రాన్స్పోర్టర్)

పరారీ లో ఉన్న నిందితులు : నలుగురు
విక్రమ్ వయస్సు 35 సంవత్సరాలు r/o రెడ్ హీల్స్ , చెన్నై, తమిళనాడు (రిసీవర్ )
సాదు గురుజి, వయస్సు 60 సంవత్సరాలు r/o చిత్రకొండ , ఒరిస్సా ( supplier )
జె. సుబ్రమణ్యం తండ్రి రఘు రామయ్య , వృత్తి లారీ ఓనర్ r/o కురుమరియమ్మన్ , కోలి స్ట్రీట్ , ఆట్టంతంగల్ పోన్నేరి, తిరుయాల్లూరు , తమిళనాడు (కంటైనర్ వెహికిల్ ఓనర్)
వికాశ్ అంకుష్ తంగేడి, తండ్రి అంకుష్ తంగేడి, r/o లోన్వాడి, సిల్లోడ్ తాలూకా, మహారాస్ట్ర (ఏర్టీగా కారు ఓనర్)
ఈ రోజు పట్టుబడిన నలుగురు వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరుగుతుంది. నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న అశ్వారావుపేట CI నాగరాజు, SI Dammapeta సాయి కిషోర్ రెడ్డి మరియు Telangana Eagle team RNCC Khammam మరియు సిబ్బందిని ఎస్పి రోహిత్ రాజు IPS ప్రత్యేకంగా అభినందించారు.