భారత్ న్యూస్ నెల్లూరు..నెల్లూరు వీధుల్లో ‘పోలీస్ యాక్షన్’: రౌడీల వెన్నులో వణుకు!
నెల్లూరు జిల్లాలో చరిత్ర సృష్టించేలా పోలీసులు చేపట్టిన ‘యాక్షన్’ కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. రౌడీయిజానికి, నేరాలకు ఇకపై స్థానం లేదంటూ… జిల్లా ఎస్పీ శ్రీమతి అజితా గారి ఆదేశాల మేరకు పోలీసులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు.
నగరంలో నమోదైన రౌడీషీటర్లను గుర్తించిన పోలీసులు వారిని సాధారణ ప్రజల కళ్లముందే ఊరేగించారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు రౌడీషీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఇది కేవలం హెచ్చరిక కాదు, నేరస్థుల గుండెల్లో భయాన్ని నింపే ‘విజువల్ వార్నింగ్’!
ఈ సాహసోపేతమైన, కఠినమైన చర్య తీసుకున్న ఎస్పీ అజితా గారిపై జిల్లా వ్యాప్తంగానే కాక, అన్ని వర్గాల ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. “పోలీసులంటే ఇది కదా!” అని ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈ ఒక్క చర్యతో నెల్లూరు జిల్లా పోలీసుల ప్రతిష్ఠ, గౌరవం అమాంతం పెరిగింది. “ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇకపై ఇంకో ఎత్తు” అన్నట్లుగా పోలీసుల వైఖరి మారింది. ఇక కౌన్సిలింగ్‌లు, వార్నింగ్‌లు కాదు, నేరుగా ‘పోలీస్ కోటింగ్’ ఖాయమని స్పష్టం చేశారు.
రౌడీలు, గూండాలు, నేరగాళ్ల గుండెల్లో గుబులు మొదలైంది. కత్తులు, నేరాలు వదిలేయకపోతే వారి ‘కౌంట్‌డౌన్’ మొదలైనట్లేనని పోలీసులు పరోక్షంగా హెచ్చరించారు.

నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ రోజు గుర్తుండిపోయే ఒక మైలురాయి. నేరం చేస్తే శిక్ష ఒక్కటే కాదు, సమాజంలో తలదించుకునేలా పరాభవం కూడా తప్పదని పోలీసులు తేల్చి చెప్పారు!