రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా రేడియం స్టిక్కర్లతో కూడిన ప్లాస్టిక్ డ్రమ్ములు ఏర్పాటు చేసిన కృష్ణాజిల్లా పోలీసులు

భారత్ న్యూస్ రాజమండ్రి….కృష్ణాజిల్లా పోలీస్

రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా రేడియం స్టిక్కర్లతో కూడిన ప్లాస్టిక్ డ్రమ్ములు ఏర్పాటు చేసిన కృష్ణాజిల్లా పోలీసులు

జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు, అవనిగడ్డ డిఎస్పి టీ.విద్య శ్రీ సూచనల మేరకు, జిల్లా వ్యాప్తంగా రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం.

అందులో భాగంగా ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకపల్లి మరియు జిలగలగండి మార్గమధ్యంలో వాహనదారుల యొక్క వేగాన్ని నియంత్రించేందుకు జిగ్జాగ్ పేట్రర్న్ లో రేడియం స్టిక్కర్స్ అతికించిన ప్లాస్టిక్ డ్రమ్ములను చల్లపల్లి ఇన్స్పెక్టర్ ఈశ్వర్ రావు గారు, ఘంటసాల ఎస్ఐ ప్రతాపరెడ్డి గారు సిబ్బంది తో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది.

మితిమీరిన వేగం వలన ప్రమాదాలు జరుగుతుండడంతో వాహన వేగాన్ని నియంత్రించి రాత్రి సమయాలలో కూడా స్పష్టంగా కనిపించే విధంగా రేడియం స్టిక్కర్స్ను డ్రమ్ములకు ఏర్పాటు చేయడం జరిగింది.