భారత్ న్యూస్ మంగళగిరిAmmiraju Udaya Shankar.sharma News Editor……అహర్నిశలు పౌరసేవలో నిమగ్నమయ్యే పోలీసులకు శిక్షణ కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కరగ్రహారం గ్రామ సమీపంలో నూతన పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతోంది.
46 ఎకరాల్లో నిర్మించబోతున్న శిక్షణా కేంద్రం భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. సహచర మంత్రివర్యులు శ్రీ Kollu Ravindra గారు, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ శ్రీ కొనకళ్ల నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, శ్రీ వర్ల కుమార్ రాజా గారు, శ్రీ వెనిగండ్ల రాము గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది.
కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి గీతాంజలి శర్మ గారు, ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ గారు, జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు గారు పాల్గొన్నారు.
