భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్:డిసెంబర్ 30
హైదరాబాద్ మల్లాపూర్, బాబానగర్, పరిధిలో లో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్నఇంటి యజమాని సుజాత(65) అనే మహిళ ఇంట్లో అద్దెకు ఉంటున్న ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు హత్య చేశారు. కోనసీమ జిల్లా పేరవలి మండలం కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు (33)ఈ నెల 24న సుజాత, అంజిబాబు కనిపించకపోవ డంతో అనుమానం కలిగి ఆమె సోదరి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ నెల 19 నుంచి సుజాత కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు. అంజిబాబును అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో అంజిబాబు బంగారం కోసం హత్య చేసినట్లు గుర్తించగా.. తన స్నేహితులు యువరాజు, (18), దుర్గారావు(35) సహాయంతో మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశానని నేరం అంగీకరించారు.

ప్రధాన నిందితుడు అంజి బాబు,కు సహకరించిన స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ట్రాలీ బ్యాగ్ లో సుజాత మృతదేహాన్నిగుర్తించారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు.