భారత్ న్యూస్ గుంటూరు….హత్య కేసు నిందితులను ..రోడ్డుపై నడిపించిన తాడేపల్లి పోలీసులు
తాడేపల్లి ఆటోడ్రైవర్ వెంకటేశ్వర రావు హత్య కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు జనాలు చూస్తుండగా రోడ్డుపై బహిరంగంగా నడిపించుకుంటూ తీసుకువెళ్లారు.
నేరాలకు పాల్పడే వారికి చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో నిందితులను పోలీస్ స్టేషన్ నుండి నడిరోడ్డుపై నడిపిస్తూ న్యాయస్థానానికి తరలించినట్లు తెలిపారు.

ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు…