…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాళహస్తి శ్రీనివాస్ హత్యకేసుకు సంబంధించి అతను బతికి ఉన్నప్పుడు వాస్తవాన్ని వివరిస్తూ తీసిన సెల్ఫీ వీడియో చాలా ఆలస్యంగా నిన్న బయటకు వచ్చింది..
ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముప్పై లక్షలు ఇస్తానని బలవంతపెట్టి తనతో కోట వినుత వీడియోలు రహస్యంగా చిత్రీకరించాలని ఆదేశించాడని చాలా వివరంగా స్పష్టంగా చెప్పుకొచ్చాడు…
ఇపుడు శ్రీనివాస్ వీడియో మరోసారి రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది..
ఈ నేపథ్యంలో కోట వినుత ఒక వీడియోను విడుదల చేశారు..
……..
వినుత
నేను మీ వినుత కోటా, తెలుగింటి అడ బిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పని చేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వస్తున్నాను.

- మేము ప్రస్తుతం చెన్నై లో ఉన్నాము ,త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించి అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను.
న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది.
సత్యమేవ జయతే….