.భారత్ న్యూస్ హైదరాబాద్….కూకట్పల్లిలో బాలిక హత్యకేసుపై పోలీసుల ప్రెస్మీట్
ఈనెల 18న బాలిక హత్య జరిగింది-సీపీ మహంతి
పోలీసులను నిందితుడు తప్పుదారి పట్టించాడు-సీపీ
నెల క్రితమే నిందితుడు ప్లాన్ చేశాడు-డీసీపీ సురేష్
బ్యాట్ కోసమే బాలిక ఇంటికి వెళ్లానని చెప్పాడు
ఎన్నిసార్లు అడిగినా డబ్బు గురించి చెప్పడం లేదు
బ్యాట్ తీసుకొని వెళ్తుండగా బాలిక అడ్డుకుంది
పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడు
నిందితుడి చొక్కాను సహస్ర పట్టుకుంది
దీంతో బాలికను నెట్టేయడంతో మంచంపై పడిపోయింది
ఆ తర్వాత విచక్షణారహితంగా కత్తితో పొడిచి పారిపోయాడు
నిందితుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు ఉంది-డీసీపీ
మా విచారణలో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు
తనిఖీల్లో నిందితుడి లేఖ, కత్తి దొరికింది-డీసీపీ
స్పెషల్ ఫోరెన్సిక్ టీం నిందితుడిని గుర్తించింది
-బాలానగర్ డీసీపీ సురేష్కుమార్
