ఆర్టీసీ బస్సులో భారీ మొత్తంలో డబ్బు తరలింపు

భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆర్టీసీ బస్సులో భారీ మొత్తంలో డబ్బు తరలింపు

ఆంధ్రప్రదేశ్ :

విజయవాడ-నెల్లూరు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న భారీ మొత్తంలో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బుధవారం ఉదయం ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ బ్యాగును పరిశీలించగా..

అందులో రూ.49.45 లక్షల నగదును గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

తాడేపల్లిగూడెనికి చెందిన మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.