కామంతో కళ్లుమూసుకుపోయి.. మైనర్‌ అఘాయిత్యం.. పోక్సో కోర్టు సంచలన తీర్పు!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..కామంతో కళ్లుమూసుకుపోయి.. మైనర్‌ అఘాయిత్యం.. పోక్సో కోర్టు సంచలన తీర్పు!

📍ఇటీవల కాలంలో మానవత్వం మరిచిన కామాంధులు చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మైనర్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన కేసులో నిందితుడికి పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడున్నరేళ్ల క్రితం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు మహమ్మద్ ఖయ్యూంకు 51జైలుశిక్ష విధించింది కోర్టు

నల్లగొండ జిల్లా తిప్పర్తి మోడల్ స్కూల్లో ఓ మైనర్ బాలిక పదవ తరగతి చదువుతోంది. తిప్పర్తికి చెందిన మమ్మద్ ఖయ్యూం.. ప్రేమ పేరుతో బాలికను వేధింపులకు గురి చేశాడు. నవంబర్ 3, 2021న బస్ స్టాప్ వద్ద ఉన్న మైనర్ అమ్మాయిని షేక్ మహ్మద్ ఖయ్యూం బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని పాడుబడ్డ ఇంట్లోకి లాక్కెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తిప్పర్తి పోలీస్ స్టేషన్ డిసెంబర్ 5,2021 న వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఖయ్యూంపై నమోదు చేశారు. 2022 నుండి పోక్సో కోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. దీంతో నిందితుడికి 51 ఏళ్ల శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది నల్లగొండ పోక్సో కోర్టు.

నిందితుడికి అత్యాచార కేసులో 20 ఏళ్లు, పోక్సో కేసులో 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ కేసులో పదేళ్ళు, సెక్షన్ 506 (మైనర్ బాలికపై బెదిరింపులు) కేసులో మరో ఏడాది శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. మొత్తం 51 ఏళ్ల జైలు శిక్షతోపాటు 8,500 రూపాయల జరిమానాను పోక్సో కోర్టు ఇంచార్జ్ న్యాయమూర్తి రోజా రమణి విధించారు. బాధితురాలికి 7 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పులో ప్రకటించింది. న్యాయస్థానానికి సరైన సైంటిఫిక్ ఎవిడెన్స్ సమర్పించడంతో.. శిక్ష నుంచి నిందితుడు తప్పించుకోలేక పోయాడని పోలీసులు చెబుతున్నారు.