వర్షంలో ఫోన్ మాట్లాడుతుండా పిడుగు పడి వ్యక్తి మృతి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….వర్షంలో ఫోన్ మాట్లాడుతుండా పిడుగు పడి వ్యక్తి మృతి….

తెలంగాణ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురంలో పిడుగు రైతు ప్రాణం తీసింది. గ్రామానికి చెందిన మహేష్ బుధవారం గేదెలను మేపుతూ వర్షంలో ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు పడి అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది…