ఆదిలాబాద్ లో గంజాయి సాగు చేసిన వ్యక్తి అరెస్ట్….

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఆదిలాబాద్ లో గంజాయి సాగు చేసిన వ్యక్తి అరెస్ట్….

ఆదిలాబాద్ రూరల్ మండలం అశోదలో గంజాయి సాగు చేస్తున్న మేస్రం భుజంగ్ రావు అనే వ్యక్తి పొలంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 160 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పండించడం, అక్రమంగా రవాణా చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది…..