భారత్ న్యూస్ హైదరాబాద్….రేపు మద్యం దుకాణాలు బంద్: సీపీ సజ్జనార్
తెలంగాణ : హోలీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలనిఆయన కోరారు. బహిరంగ ప్రదేశాల్లో, పాదచారులు, వాహనాలపై రంగులు చల్లొద్దని.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై షీ టీమ్స్ నిఘా ఉంటుందన్నారు.
