పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు రెప్పపాటులో పగలగొట్టి, ల్యాప్ ట్యాప్ లు, నగదు, బంగారం దోచుకెళ్లిన హైటెక్ దొంగను చాకచక్యంగా అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు,.//

భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…గుంటూరు జిల్లా పోలీస్…

//పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు రెప్పపాటులో పగలగొట్టి, ల్యాప్ ట్యాప్ లు, నగదు, బంగారం దోచుకెళ్లిన హైటెక్ దొంగను చాకచక్యంగా అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు,.//

‼️ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్, రూ.6 ల్యాప్టాప్లు, 11 గ్రాముల బంగారం, రూ.2 లక్షల నగదు రికవరీ.
‼️గతంలో హత్యకేసులో నిందితుడు.వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న వైనం.
‼️యూట్యూబ్ ద్వారా కార్ల అద్దాలు ఎలా పగలగొట్టాలో తెలుసుకుని, దొంగతనాలు చేయడంలో ఆరితేరిన వ్యక్తి.
‼️రెప్పపాటులో అద్దాలు పగలగొట్టి, కార్లలోని విలువైన వస్తువులు దోచుకెళ్లడంలో అందెవేసిన చేయి.
‼️సీసీటీవీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా దొంగను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు.
‼️పోలీసుల కళ్లుగప్పి నేరస్తులు తప్పించుకోలేరని, ఎప్పటికైనా పట్టుబడతారని స్పష్టం చేసిన ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు.

🚩 ఈరోజు (05.09.2025) జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గుంటూరు నగరంలో కార్ల అద్దాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడే నిందితుడిని అరెస్ట్ గురించిన వివరాలను వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు,

✳️ గుంటూరు నగరంలో గత ఆగస్టు నెలలో నల్లపాడు మరియు నగరంపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నిలిపి ఉంచిన కార్ల అద్దాలు పగలగొట్టి, వాటిలోని విలువైన వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితుల నుండి రాబడిన ఫిర్యాదుల మేరకు దొంగతనాలకు పాల్పడుతున్న వారిని కనిపెట్టి, అరెస్ట్ చేయాలని నల్లపాడు, నగరం పాలెం మరియు సీసీఎస్ పోలీస్ అధికారులను గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు ఆదేశించడం జరిగింది.

✳️ శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఘటనలు జరిగిన/కార్లు పార్కింగ్ చేసిన ప్రదేశాలు, చుట్టు ప్రక్కల పరిసరాలు, ఘటనలు జరిగిన తీరు, ఘటన జరిగిన సమయం, ఘటనల్లో లభించిన భౌతిక, సాంకేతిక ఆధారాలు మరియు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు మొదలగు పలు కోణాల్లో ముమ్మర దర్యాప్తు చేపట్టగా నల్లపాడు పోలీస్ వారికి లభించిన సమాచారం మేరకు జంగం. బాజి,
S/O ముక్కంటి, A/33, గొరిజవోలు గ్రామము, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా అనే అతను ఈ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు కనిపెట్టి, అతని అదుపులోకి తీసుకుని విచారించగా అతను గుంటూరు నగరంలో మొత్తం 10 హైటెక్ దొంగతనాలకు పాల్పడి లాప్టాప్, నగదు, బంగారం దొంగిలించినట్లు వెల్లడించడం జరిగింది.

  • నల్లపాడు — 04 కేసులు,
  • నగరం పాలెం — 03 కేసులు,
  • పెదకాకాని –01 కేసు,
  • పాత గుంటూరు — 01 కేసు
  • అరండల్ పేట — 01 కేసు.

✳️ నిందితుడు నరసరావుపేట ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No.68/2022 హత్య కేసులో నిందితుడు కాగా, ఇతనిపై రౌడీ షీట్ కూడా నమోదైనదనీ తెలిసింది.

✳️ నిందితుని వద్ద నుండి రికవరీ చేసినవి :–

  • 06 ల్యాప్టాప్ లు,
  • రూ.2,00,000/- నగదు,
  • 11 గ్రాముల బంగారం

✳️ గత మూడు నెలలుగా జరుగుతున్న ఈ హైటెక్ దొంగతనాలకు నల్లపాడు పోలీస్ వారు ఎంతో చాకచక్యంగా ముగింపు పలికారు.

✳️ నిందితుడిని అరెస్ట్ చేయడంలో విశేష కృషి చేసిన నల్లపాడు సీఐ వంశీధర్ గారు, సీసీఎస్ సీఐ శ్రీమతి అనురాధ గారు, ఎస్సై చల్ల.వాసు గారు, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, కానిస్టేబుళ్లు సాంబశివరావు, బిక్షు నాయక్, మస్తాన్ తదితరులు, వారికి దిశానిర్దేశం చేసిన సౌత్ డిఎస్పీ శ్రీమతి భానోదయ గారిని శ్రీ ఎస్పీ గారు అభినందించారు.